SS Rajamouli: మరో స్టార్ హీరోతో చేతులు కలపనున్న రాజమౌళి

SS Rajamouli: బాహుబలి సినిమా తో తెలుగు ఇండస్ట్రీని ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి...

admin1
Updated on: 16 March 2022 4:01 PM IST
SS Rajamouli Next Movie with Allu Arjun After Mahesh Babu Movie | Tollywood News
X

SS Rajamouli: మరో స్టార్ హీరోతో చేతులు కలపనున్న రాజమౌళి

SS Rajamouli: బాహుబలి సినిమా తో తెలుగు ఇండస్ట్రీని ఒకేసారి పది మెట్లు పైకి ఎక్కించిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసుకున్న తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ అయిన "పుష్ప: ది రూల్" సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ 2023 లో రాజమౌళి తో చేతులు కలపనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన మరియు నటీనటుల గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

admin1

admin1

Next Story