World Best Directors: ప్రపంచ డైరెక్టర్లల జాబితాలో ఒకే ఒక్క తెలుగు డైరెక్టర్

ప్రపంచ డైరెక్టర్లల జాబితాలో ఒకే ఒక్క తెలుగు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈ జాబితాలో 25 స్థానాన్ని గెలుచుకున్నారు.

admin1
Updated on: 12 Dec 2021 10:00 PM IST
SS Rajamouli is the only Telugu Director Got 25th Place in the List of World Best Directors
X

ప్రపంచ డైరెక్టర్లల జాబితాలో ఒకే ఒక్క తెలుగు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి(ఫైల్-ఫోటో)

World Best Directors - SS Rajamouli: తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా ఛానల్ వారు ప్రపంచంలోనే 50 మంది ప్రముఖ డైరెక్టర్ల పేర్లను ఎంపిక చేశారు. అందులో మొదటి స్థానం సౌత్ కొరియా లో సూపర్ హిట్ అయిన "పారాసైట్" సినిమా చిత్ర దర్శకుడు బోంగ్ జూన్ హో కి దక్కగా ఒక ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఈ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటిదాకా ఫ్లాప్ అనే పదాన్ని ఎరగకుండా వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను అందిస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి ఈ జాబితాలో 25 స్థానాన్ని గెలుచుకున్నారు.

బాహుబలి సినిమా తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా కేవలం భారతదేశంలో మాత్రమే పరిమితమైన తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా "బాహుబలి" సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇలా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమైన రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అందరి దృష్టి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" పైన ఉన్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story