Brahmastra: అలియా భట్ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ రాజమౌళిదా?

SS Rajamouli is the Mastermind Behind Alia Bhatts Plan
x

Brahmastra: అలియా భట్ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ రాజమౌళిదా?

Highlights

ఆలియా భట్ కి ఐడియా ఇచ్చింది రాజమౌళి నా?

Brahmastra: బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనే నానుడి ఇప్పుడు చిత్ర పరిశ్రమకు బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆమీర్ ఖాన్ అమితాబచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు కానీ తెలుగు సినిమాలు మాత్రం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక్క హిట్ సినిమా కూడా లేక బాలీవుడ్ వెలవెలపోతుంటే టాలీవుడ్ మాత్రం వరుస పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు తమ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి కష్టపడుతున్నారు. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన "బ్రహ్మస్త్ర" సినిమాని కూడా ఇప్పుడు తెలుగులో ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి రంగంలోకి దింపి సినిమాని ప్రమోట్ చేయమని కోరారు. రాజమౌళి కూడా తన వంతు సహాయంగా సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నారు.

అయితే అలియా భట్ తెలుగులో మాట్లాడటం, తెలుగు పాట పాడటం సినిమా ప్రమోషన్స్ కి బాగానే వర్కౌట్ అయింది. అలియా భట్ స్వయంగా తెలుగులో మాట్లాడడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ కి ఈ ఐడియా ఇచ్చింది రాజమౌళినే అని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవటం కోసం తెలుగు నేర్చుకుంటే బాగుంటుందని దగ్గరుండి ఆమెకు తెలుగు కొంచెం నేర్పించి స్వయంగా పాట కూడా పాడించారట. ఎంతైనా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories