logo
సినిమా

RRR Movie: "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా చిరంజీవి, బాలయ్య..!!

SS Rajamouli Invites Chiranjeevi and Balakrishna for RRR Movie Pre Release Event | RRR Movie Updates
X

RRR Movie: "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా చిరంజీవి, బాలయ్య..!!

Highlights

RRR Movie Pre Release Event: ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన '...

RRR Movie Pre Release Event: ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన "ఆర్ఆర్ఆర్" సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే "ఆర్ఆర్ఆర్" సినిమాని బాలీవుడ్ లో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ముంబైలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులతో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ లో అతి త్వరలో "ఆర్ఆర్ఆర్" చిత్ర యూనిట్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే అన్స్టాపబుల్ టాక్ షోలో రాజమౌళి,కీరవాణిలను గెస్టులుగా ఆహ్వానించిన బాలయ్య.. "ఆర్ఆర్ఆర్" ఈవెంట్ కి నందమూరి ఎన్టీఆర్ కోసమే కాకుండా అభిమానుల కోసం అతిధిగా పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.

ఇక మెగా అభిమానుల కోసం రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అటు నందమూరి, మెగాహీరోలతో పాటు అభిమానులతో ప్రీ రిలీజ్ ని "ఆర్ఆర్ఆర్" టీం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 2వ తారీఖున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Web TitleSS Rajamouli Invites Chiranjeevi and Balakrishna for RRR Movie Pre Release Event | RRR Movie Updates
Next Story