RRR Movie Shooting: "ఆర్ఆర్ఆర్" షూటింగ్ ను పొడిగించిన రాజమౌళి

* కీలక సన్నివేశాల షూటింగ్ కోసం షూటింగ్ ను మరొక నాలుగు రోజులు పొడిగించినట్లు సమాచారం

admin1
Updated on: 4 Sept 2021 8:30 PM IST
SS Rajamouli Extends the RRR Movie Shooting for Four Days
X

"ఆర్ఆర్ఆర్" షూటింగ్ ను పొడిగించిన రాజమౌళి (ఫైల్ ఫోటో)

RRR Movie Shooting: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు చిత్రబృందం ఈ చిత్ర షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో పడింది.

తాజాగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ షూటింగ్ పూర్తి చేసుకొని వారి వారి కార్లలో చాలా ఫాస్ట్ గా తిరిగి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి మళ్లీ షూటింగ్ అని ఆపేస్తారు ఏమో అని అంత స్పీడ్ గా వెళ్లి పోతున్నట్లు ఉన్నారు అని అభిమానులు సరదాగా కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు అవి నిజం కాబోతున్నాయి. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కోసం షూటింగ్ ను మరొక నాలుగు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రకని, రే స్టీవెన్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story