SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" వాయిదా పుకార్ల పై రియాక్ట్ అయిన రాజమౌళి

SS Rajamouli: "ఆర్ ఆర్ ఆర్" విడుదల పుకార్ల లో నిజం లేదు అంటున్న రాజమౌళి

admin1
Updated on: 31 Dec 2021 2:15 PM IST
SS Rajamouli Clarified the Release Date of RRR movie | Movie News
X

 "ఆర్ ఆర్ ఆర్" విడుదల పుకార్ల లో నిజం లేదు అంటున్న రాజమౌళి

SS Rajamouli: కొత్త సంవత్సరం కంటే ఎక్కువగా జనవరి 7న విడుదల కాబోయే "ఆర్ ఆర్ ఆర్" సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మధ్యనే విడుదల కావాల్సిన కొన్ని హిందీ సినిమాలు వాయిదా పడటం, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో ప్యాన్ ఇండియన్ సినిమా అయిన "ఆర్ ఆర్ ఆర్" విడుదల పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

లాక్‌డౌన్‌ వలన ఈ సినిమాని వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్లను కొట్టిపారేశారు. "ఆర్ఆర్ఆర్" సినిమా వాయిదా పడదని, అనుకున్న తేదీనే విడుదల అవుతుందని కచ్చితంగా చెప్పారు. దీంతో అభిమానులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఆలియా భట్ మరియు ఓలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

admin1

admin1

Next Story