ఎన్టీఆర్ తో సోలో ఫిలిం పక్కకు పెట్టిన రాజమౌళి.. ఎందుకంటే..?

Jr NTR - SS Rajamouli:ఎన్టీఆర్ ఈమధ్యనే స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.

Shireesha
Updated on: 26 April 2022 8:00 PM IST
SS Rajamouli Cancelled Solo Movie with Jr NTR for RRR | Tollywood Gossips
X

ఎన్టీఆర్ తో సోలో ఫిలిం పక్కకు పెట్టిన రాజమౌళి.. ఎందుకంటే..?

Jr NTR - SS Rajamouli: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్యనే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమా తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో "స్టూడెంట్ నెంబర్ 1", "సింహాద్రి" మరియు "యమదొంగ" వంటి సూపర్ హిట్ ల తర్వాత నాలుగవ సినిమాగా తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్" బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపిస్తోంది.

అయితే కొందరు మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏమాత్రం బాగోలేదని తన పాత్రకి నటన పరంగా అంత స్కోప్ కూడా దక్కలేదని అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో "గరుడ" అనే ఒక సినిమాని ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిజానికి "బాహుబలి 2" సినిమా తర్వాత ఈ సినిమా పట్టలెక్కల్సిందట.

కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని ఆపేసి రాజమౌళి రామ్ చరణ్ ని కూడా రంగంలోకి దింపి "ఆర్ ఆర్ ఆర్" సినిమాని చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు "గరుడ" ప్రాజెక్టుని రాజమౌళి మళ్లీ మొదలు పెడితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో, ఇక రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయనున్నారు.

Shireesha

Shireesha

Next Story