Mahesh Babu: మహేశ్ సినిమాల మీద గాసిప్స్ కి జక్కన్న బ్రేక్..

SS Rajamouli: మహేశ్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది.

Arun Chilukuri
Updated on: 14 Jun 2023 7:30 PM IST
SS Rajamouli and Mahesh Babu Movie Update
X

Mahesh Babu: మహేశ్ సినిమాల మీద గాసిప్స్ కి జక్కన్న బ్రేక్..

SS Rajamouli: మహేశ్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది. ఆ తర్వాత ఏంటంటే మాత్రం రాజమౌళి సినిమా అని అందరికి తెలిసిందే. కాని తెలియని విషయం మాత్రం ఎప్పడు లాంచ్ అవుతుంది. ఎప్పుడు రిలీజౌతుంది.. ఆ విషయంలో గాసిప్స్ వల్ల కన్ ఫ్యూజన్స్ పెరిగాయి. మహేశ్ మూవీని తన బర్త్ డే అయిన ఆగస్ట్ 9న లాంచ్ చేయబోతున్నాడు రాజమౌలి అన్నారు. కాని అదేం లేదు అవన్నీ వట్టి గాసిప్స్ అని తేల్చింది జక్కన్న టీం. ఐతే ఇప్పటివరకు మహేశ్ మూవీ తాలూకు గుసగుసలన్నీ గాసిప్సేనా అంటే లేదు, అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

మహేశ్ తో రాజమౌళి తీయబోయే సినిమా సంక్రాంతికే పట్టాలెక్కుతుందట. ఆగస్ట్ 9న కాదని క్లారిటీ ఇస్తోంది ఫిల్మ్ టీం. ఐతే ఇంకా స్క్రిప్ట్ వర్కే పూర్తి కాలేదని, కథ సిద్దమైనా, కథనం రెడీ కాలేదని తెలుస్తోంది. ఇది పీరియాడికల్ డ్రామా అని కూడా అంటున్నారు. లార్డ్ హానుమాన్ ప్రేరణతో హీరో పాత్రని డిజైన్ చేస్తున్నాడట రాజమౌళి. దీంతో పాటు సౌత్ ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలు అనే పాయింట్ కూడా నిజమేనని, ఇక ఈ సినిమా తాలూకు వచ్చిన, వస్తున్న గుసగుసలన్నీ గాసిప్స్ అని తేల్చేసింది జక్కన్న టీం. ఐనా మహేశ్ మూవీల మీద గాసిప్స్ ఆగట్లేదు.

ఆగడు తర్వాత ఖలేజా ఆతర్వాత గుంటూరు కారం అంటూ త్రివిక్రమ్ హ్యాట్రిక్ ప్లాన్ చేశాడు. మహేశ్ ఫ్యాన్స్ లో సందడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతా బానే ఉంది. కాని గుంటూరు కారం మీద కూడా వస్తున్నవన్నీ గాసిప్సే అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకుని చేస్తున్న ప్రచారం ఇది అనేస్తున్నారు. గుంటూరు కారంలో తమన్న ని తీసేస్తారని కాసేపు, రెండో కథ కూడా మహేశ్ పక్కన పెట్టాడని కాసేపు, అసలు షూటింగ్ ఆగిపోతుందని మరికాసేపు, ఇలా రెండు వారాలకో కొత్త గాసిప్ వస్తోంది. ఐతే ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తున్న పుకార్లని గుంటూరు కారం టీం క్లారిటీ ఇస్తోంది.

మహేశ్ కి యాంటీ ఫ్యాన్స్ గొడవ కొత్త కాదు. కాని రాజమౌళి మూవీ, త్రివిక్రమ్ సినిమా విషయంలో మాత్రం ఎన్నడూ లేనన్ని గాసిప్స్ పెరిగాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారాల గొడవ పెరిగింది. వీటన్నీంటికి పీ ఆర్ టీం తో మహేశ్ అండ్ కో క్లారిటీ ఇస్తున్నారని, అనవసరపు ప్రచారాలకు బ్రేక్ వేస్తున్నారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story