అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..?

SS Rajamouli and Allu Arjun Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రం నిర్మిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 3:23 PM IST
అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..?
X

అల్లు అర్జున్- రాజమౌళి కాంబో ఫిక్స్..?

SS Rajamouli and Allu Arjun Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ చిత్రం రూపొందించనున్నారనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ట్రైబల్ నేపథ్యంలో సాగనుందని ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం 'వారణాసి'ని తెరకెక్కిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ఈ ప్రాజెక్టును విజువల్ వండర్‌గా మలచనున్నారు. గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందనే చర్చ సాగుతోంది. 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ - రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా ట్రైబల్ నేపథ్యంలో ఈ కథ సాగనుందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు సినీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story