అల్లు అర్జున్ సినిమా విషయంలో సుకుమార్ కి సలహా ఇచ్చిన రాజమౌళి

పుష్ప సినిమా ని అలా మార్చమని సుకుమార్ కి రాజమౌళి ఇచ్చిన సలహా

admin1
Published on: 18 Dec 2021 5:04 PM IST
SS Rajamouli Advised Sukumar about the Pushpa Movie
X

అల్లు అర్జున్ సినిమా విషయంలో సుకుమార్ కి సలహా ఇచ్చిన రాజమౌళి(ఫైల్-ఫోటో)

Pushpa Movie: అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమాగా "పుష్ప: ది రైజ్" ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ సినిమాగా మార్చాలని సుకుమార్ కి ఆలోచనే లేదట. కానీ రాజమౌళి సలహా మేరకు ఈ సినిమా పాన్ ఇండియా వైపు వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా చిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేశారు.

"నా దృష్టి అంతా తెలుగు పైనే ఉంది. ముందు తెలుగు ఆడియెన్స్ ని సంతోష పెట్టాలి అనేదే నా ఆలోచన. మళ్లీ అన్ని భాషల్లో ఉంటే సరిగ్గా చేయగలమో లేదో అని డౌట్ ఉంది. అప్పుడు రాజమౌళి గారు ఫోన్ చేసి నీది పాన్ ఇండియా సినిమా. నీవు తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా అవుతుంది. ప్యాన్ ఇండియాలో చేస్తే ప్యాన్ ఇండియా సినిమా అవుతుంది. వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్యాన్ ఇండియా లో విడుదల చేయ్" అని గట్టిగా చెప్పారు. ఆ సలహాతో పాన్ ఇండియాపై ద్రుష్టి పెట్టాను. కానీ పాన్ ఇండియా పనులు మొత్తం చాలావరకు నిర్మాతలు మరియు బన్నీ చూస్తున్నారు" అని చెప్పుకొచ్చారు సుకుమార్.

admin1

admin1

Next Story