Balakrishna: బాలయ్యకు జోడీగా ఎవరంటే..?

Balakrishna: టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు కథనాయికలు దొరకడంలేదని విషయం తరుచుగా వినిపిస్తున్న విషయమే.

Venkata Chari
Updated on: 1 Jun 2021 7:45 PM IST
Sruthi Haasan is Plying a Heroine Role in Balakrishna Movie
X

దర్శకుడు గోపిచంద్ మలినేని, బాలయ్య బాబు (ఫొటో ట్విట్టర్)

Balakrishna: టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు కథనాయికలు దొరకడంలేదని విషయం తరుచుగా వినిపిస్తున్న విషయమే. నయనతార తమిళ సినిమాలే చేస్తుండడం.. అనుష్క ఈ మధ్య సినిమాలు తగ్గించిన విషయం విధితమే. ఇక ఫామ్‌లో ఉన్న కాజల్.. తమన్నాలతోనే నెట్టుకొస్తున్నారు. ఇదే సమస్య నందమూరి హీరో బాలకృష్ణ కూడా తగిలిందంట. దర్శకుడు గోపిచంద్ మలినేని, బాలయ్య బాబు కాంబినేషన్‌లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొద్ది రోజులుగా హీరోయిన్‌ కోసం వెదికినా దొరకలేదని తెలుస్తోంది. అయితే, తాజాగా బాలయ్య బాబుకు హీరోయిన్‌ దొరికినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మొదట త్రిషను డైరెక్టర్ సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ, త్రిష పలు కారణాలతో ఈ సినిమాలో చేయడం లేదని తెలుస్తోంది. తాజాగా శ్రుతి హసన్ ను బాలయ్యకు జోడీగా నటింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈమేరకు శ్రుతి హసన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదివరకే డైరెక్టర్ గోపీచంద్ లో రెండు సినిమాలు చేసిన కారణంతో బాలయ్య సినిమాను ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య-శ్రుతి హసన్ కాంబినేషన్‌ ఎలా ఉంటుందో చూసేందుకు ఫ్యాన్స్‌ ఉత్సాహపడుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story