రేపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు..

Sr.NTR Daughter Uma Maheshwari Passed Away
x

రేపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు..

Highlights

Kantamaneni Uma Maheswari: ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్న కూతురు, అల్లుడు

Kantamaneni Uma Maheswari: ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకొంది. ఉమామహేశ్వరి దీక్షిత పోలీసులకు కంప్లయింట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీక్షిత ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని దీక్షిత ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుందని, భోజనానికి బయటకు రాకపోవడంతో తలుపులు తెరిచే ప్రయత్నం చేశామని దీక్షిత చెప్పారు.

విషయం తెలియగానే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. బాలకృష్ణ, లోకేశ్ తో పాటు ఉమామహేశ్వరి తోబుట్టువులు చేరుకున్నారు. ఇక పోస్ట్‎మార్టమ్ కోసం డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టమ్ పూర్తవడంతో డెడ్ బాడీని మళ్లీ జూబ్లీహిల్స్ లోని ఉమామహేశ్వరి ఇంటికి చేర్చారు. ఇవాళ రాత్రి వరకు ఉమామహేశ్వరి కూతురు, అల్లుడు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.రేపు ఉమామహేశ్వరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories