logo
సినిమా

Srinu Vaitla: శ్రీను వైట్ల మొదటి సినిమా రాజశేఖర్ తో చేయాల్సిందా ?

Srinu Vaitla: శ్రీను వైట్ల మొదటి సినిమా రాజశేఖర్ తో చేయాల్సిందా ?
X

శ్రీను వైట్ల &రాజశేఖర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Srinu Vaitla: రాజశేఖర్ తో శ్రీను వైట్ల "అపరిచితుడు" సినిమా చేయాల్సిందా..!?

Srinu Vaitla: సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే "కల్కి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాతో బాగానే ఆకట్టుకున్న రాజశేఖర్ ఇప్పటిదాకా చాలా వరకు సీరియస్ సినిమాలను మాత్రమే చేశారు. మరోవైపు డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమా అంటే గుర్తొచ్చేది కామెడీ. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుంది? నిజానికి శ్రీను దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితమే రాజశేఖర్ ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఆ సినిమాకి "అపరిచితుడు" అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చిన శ్రీను వైట్ల ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. "దూకుడు" సినిమా దశమ వార్షికోత్సవం జరిగినప్పటినుంచి శ్రీను వైట్ల తరచుగా మీడియా లో కనిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆ క్రమంలోనే ఆలీతో సరదాగా షో లో కూడా పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అరంగేట్రం రాజశేఖర్ తోనే జరగాల్సింది అని, కానీ ఆ సినిమా మొదలైనట్లే మొదలయ్యి ఆగిపోయిందని అన్నారు. ఆ తర్వాతే రవితేజతో "నీకోసం" చేశానని చెప్పారు శ్రీను వైట్ల. అయితే ఆ సినిమా చూసిన రామోజీరావు ఇంప్రెస్ అయ్యి తన సంస్థలో సినిమా చేసే అవకాశం ఇస్తాం అన్నారట.

మంచి రోజు చూసి సినిమా మొదలు పెడతాను అంటే "చెడ్డ రోజే మొదలు పెట్టండి. సినిమా ఎందుకు ఆడదో చూద్దాం" అని అన్నారట. ఇక వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన "ఆనందం" ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Web TitleSrinu Vaitla Says My First Movie with Rajasekhar is Cancelled With Some Reasons
Next Story