Srinu Vaitla: "అందుకే ఆ సినిమా ప్లాప్ అయ్యింది" అంటున్న శ్రీనువైట్ల

* నిజానికి చిరంజీవిగారి ఇమేజ్‌కు త‌గ్గ క‌థ నా దగ్గర ఉంది అని అన్నారు శ్రీను వైట్ల

admin1
Updated on: 6 Nov 2021 5:15 PM IST
Srinu Vaitla says in an Interview that Andarivaadu Movie Story is not Mine
X

అందుకే ఆ సినిమా ప్లాప్ అయ్యింది అంటున్న శ్రీనువైట్ల(ఫైల్ ఫోటో)

Srinu Vaitla - Andarivaadu Movie Story: మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదల అయిన "అంద‌రివాడు" సినిమాకి దర్శకత్వం వహించారు శ్రీనువైట్ల. భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ, ఆ సినిమా అనుకున్న విజయాన్ని పొందలేదు.

తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో అంద‌రివాడు సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందనే విష‌యానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు శ్రీను వైట్ల. "అసలు అందరివాడు కథ నాది కాదు. వేరెవరో రాసిన కథను నేను డైరెక్ట్ చేశాను. కథ రెడీగా ఉంది, డైరెక్ట్ చేయ‌మెంటే చేశాను కానీ అలాంటి సినిమాకు నేను సూట్ కాను" అని అన్నారు శ్రీను వైట్ల.

"నిజానికి చిరంజీవిగారి ఇమేజ్‌కు త‌గ్గ క‌థ నా దగ్గర ఉంది'' అని అన్నారు శ్రీను వైట్ల. మరి ఆ కథ గురించి చిరు తో చెప్పలేదా అని అడగగా, "ఆయ‌న (చిరంజీవి) టూ బిగ్ ఇమేజ్ ప్రాబ్ల‌మ్" అని చెప్పారు శ్రీను వైట్ల. ఇక అంద‌రివాడు 2005లో విడుద‌లైంది.

సినిమాకు భూప‌తిరాజా క‌థ‌ను అందించగా, కోన వెంక‌ట్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తండ్రీ కొడుకులుగా డ్యుయల్ రోల్ లో కనిపించారు. ట‌బు, రిమి సేన్ హీరోయిన్స్‌గా న‌టించగా, అల్లు అర‌వింద్ నిర్మాత‌గా వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీనువైట్ల విష్ణు మంచు హీరోగా "ఢీ అంటే ఢీ" సినిమాతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story