Srinu Vaitla: రెండు ప్రాజెక్టులు పోగొట్టుకున్న శ్రీను వైట్ల

Srinu Vaitla: శ్రీను వైట్లకి ఇదే ఆఖరి చాన్స్ అవుతుందా?

Dhatripriya
Updated on: 13 March 2023 9:30 PM IST
Srinu Vaitla Lost Two Projects
X

రెండు ప్రాజెక్టులు పోగొట్టుకున్న శ్రీను వైట్ల 

Srinu Vaitla: ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ హిట్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల కూడా ఒకరుగా ఉండేవారు."నీ కోసం" సినిమాతో డైరెక్టర్ గా మారిన శ్రీనువైట్ల కెరియర్ మొదట్లోనే ఆనందం, వెంకీ, సొంతం, ఢీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రవితేజ తో దుబాయ్ శీను తర్వాత శ్రీను వైట్ల మళ్లీ ఫామ్ లోకి రాలేదు. దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కానీ ఆ తర్వాత పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ చేయలేదు.

ఒకవైపు కెరియర్ మాత్రమే కాక మరోవైపు వ్యక్తిగత జీవితం కారణంగా కూడా శ్రీనువైట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు ప్రాజెక్టులను కూడా షూటింగ్ పూర్తి అయిపోయాక చేజార్చుకున్నారు. "ఢీ" సినిమాకి సీక్వెల్ గా "ఢీ అండ్ ఢీ" అనే సినిమాని ప్రకటించారు శ్రీను వైట్ల. విష్ణు మంచు హీరోగా నటిస్తుండగా ఫరీయా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించాలి. కానీ రెండు మూడు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయిపోయాక ఈ సినిమా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఒక ప్రముఖ నిర్మాత కొడుకుతో శ్రీను వైట్ల మళ్లీ ఈ సినిమాని మొదలు పెట్టారని వార్తలు వినిపించాయి కానీ అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం శ్రీను వైట్ల ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నైనా పూర్తి చేసి శ్రీను వైట్ల విడుదల చేయగలరా లేదా అని ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా నిజంగా హిట్ అయితే అది శ్రీనువైట్ల కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story