Srikanth: వారసుడులో నా పాత్ర ఇదే..

Srikanth: వారసుడులో నా పాత్ర ఇదే..

Arun Chilukuri
Updated on: 4 Jan 2023 9:30 PM IST
Srikanth Will Play Vijays Brother Role in Varasudu
X

Srikanth: వారసుడులో నా పాత్ర ఇదే..

Srikanth: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "అఖండ" లో ముఖ్య విలన్ పాత్రలో కనిపించిన హీరో శ్రీకాంత్ గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు శ్రీకాంత్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" లో కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాతో శ్రీకాంత్ తమిళ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు శ్రీకాంత్. "నా కరియర్ లో తమిళ్ సినిమా చేయటం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో నేను విజయ్ సోదరుడి పాత్రలో కనిపించనున్నాను. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అభిమానులకి ఈ సినిమా ఒక కనుల పండగ అని చెప్పొచ్చు.

రష్మిక మందన్న, జయసుధ, కిక్ శ్యామ్, శరత్ కుమార్, సంగీత, ప్రభు అందరూ తెలుగు సినిమాల్లో కూడా చేసిన వాళ్లే కాబట్టి సినిమాలో తెలుగు నేటివిటీ ఎక్కువగానే ఉంటుంది," అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. "ఇద్దరు సోదరుల మధ్య ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. వంశీ పైడిపల్లి సినిమాలన్నిటిలోనూ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ఆయన ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయన మేకింగ్ లో పర్ఫెక్షన్ ఉంటుంది. విజయ్ సినిమాతో తమిళ్లో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది," అని శ్రీకాంత్‌ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story