ఫ్యాన్ వార్ ల గురించి రియాక్ట్ అయిన నాని డైరెక్టర్

Srikanth Odela: దసరాలో తెలంగాణ యాస గురించి కామెంట్లు చేసిన డైరెక్టర్

Dhatripriya
Updated on: 19 March 2023 9:30 PM IST
Srikanth Odela Comments On Telangana Slang In Dasara Movie
X

ఫ్యాన్ వార్ ల గురించి రియాక్ట్ అయిన నాని డైరెక్టర్

Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా లో నాని ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలోని గోదావరిఖని ప్రాంతంలో బొగ్గు గని నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ లో నాని మరియు మిగతా నటీనటులు తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రచ్చ మొదలైంది. సినిమా మొత్తం తెలంగాణ యాసలోనే ఉంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యాస గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ లు మొదలయ్యాయి.

తాజాగా ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దీని గురించి రియాక్ట్ అయ్యారు. "నా ఫ్రెండ్స్ అంతా ఆంధ్ర వాళ్ళు. నా భాష వాళ్ళకి అర్ధం అవుతుంది. వాళ్ళ భాష నాకు అర్ధం అవుతుంది, మారి ఈ గొడవలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు అర్ధం కాట్లేదు" అని అన్నారు శ్రీకాంత్ ఓదెల. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 30వ తేదీన విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story