Ravi Teja- Venkatesh: మరో భారీ మల్టీ స్టారర్..!

Ravi Teja- Venkatesh: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా నడుస్తోంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2022 4:35 PM IST
Srikanth Addala Planning a Big Multistarrer Film
X

Ravi Teja- Venkatesh: మరో భారీ మల్టీ స్టారర్..! 

Ravi Teja- Venkatesh: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా నడుస్తోంది. స్టార్ హీరోలు కూడా మీడియం రేంజ్ హీరోలతో కలిసి నటించేందుకు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల పై బాగా ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాలగోపాల, ఎఫ్ 2 వంటి మల్టీస్టారర్ సినిమాలో నటించిన వెంకటేష్ ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమాలో కూడా కనిపించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. "కొత్త బంగారులోకం" సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరియు నారప్ప సినిమాలకు కలిసి పని చేశారు.

ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇప్పుడు వెంకటేష్ మరియు రవితేజ లు హీరోలుగా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నారు శ్రీకాంత్. ఒకవేళ ఇదే నిజమైతే అది ఒక క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story