అసురన్ తెలుగు రీమేక్ లోకి మరో దర్శకుడు?

venkatesh
x
venkatesh
Highlights

గత కొద్దిరోజుల నుంచీ మాత్రం కొంతమంది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో హను రాఘవపూడి పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది.

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్.. తమిళ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా వంద కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది తేలాల్సి ఉంది. గత కొద్దిరోజుల నుంచి మాత్రం కొంతమంది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో హను రాఘవపూడి పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో హను అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు లాంటి చిత్రాలకి దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ లిస్టులోకి మరో దర్శకుడి పేరు చేరింది.

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలను చేసిన శ్రీకాంత్ అడ్డాలకి ఈ సినిమా ఆఫర్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ కథలను మాత్రామే చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని టేకోవర్ చేస్తాడా అన్న అనుమానం ప్రేక్షకులలో కలుగుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. ఇందులో శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories