Sridevi Vijay Kumar: బ్లాక్ సారీలో శ్రీదేవి విజయ్ కుమార్.. అందంలో యంగ్ హీరోయిన్లకు పోటీ..

Sridevi Vijay Kumar Looking Too Gorgeous In Black Saree
x

బ్లాక్ సారీలో శ్రీదేవి విజయ్ కుమార్.. అందంలో యంగ్ హీరోయిన్లకు పోటీ..

Highlights

శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్‌ లో హీరోయిన్‌గా నటించారు.

Sridevi Vijay Kumar: శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్‌ లో హీరోయిన్‌గా నటించారు. అప్పటికి ఇప్పటికీ తరగని అందంతో అలాగే ఉన్నారు. యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీదేవి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా బ్లాక్ కలర్ సారీలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు తన అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీదేవి విజయ్ కుమార్.. తమిళ నటుడు విజయ్ కుమార్‌ కుమార్తెగా రుక్మిణి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమ్యారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్‌లో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. తన అందంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ శ్రీదేవి టాలీవుడ్‌లో కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్, వీర సినిమాల్లో నటించారు.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రాహుల్ అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్నారు. 2006లో రూపిక అనే పాపకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి.. తెలుగులో వీర సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బుల్లితెర పై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యారు. ప్రస్తుతం తమిళ్ లో ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో శ్రీదేవి సుందరకాండ అనే సినిమాతో మరోసారి రీఎంట్రీ ఇవ్వనున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories