కెసిఆర్ రియల్ హీరో అంటున్న శ్రీ రెడ్డి

కెసిఆర్ రియల్ హీరో అంటున్న శ్రీ రెడ్డి
x
Highlights

టాలీవుడ్ లో #మీటూ ఉద్యమానికి నాంది పలికింది శ్రీ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే లైంగిక వేధింపుల ను వెలుగులోకి తీసుకు రావడమే కాక...

టాలీవుడ్ లో #మీటూ ఉద్యమానికి నాంది పలికింది శ్రీ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే లైంగిక వేధింపుల ను వెలుగులోకి తీసుకు రావడమే కాక కొన్ని పెద్ద పేర్లు కూడా బయట పెట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జీవో పాస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇది తన పోరాటానికి దక్కిన గౌరవం అంటూ శ్రీరెడ్డి కేసీఆర్ కు తాజాగా కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో దీనిపై ఒక పెద్ద పోస్టుని పెట్టింది శ్రీరెడ్డి.

"ఒక హైదరాబాద్ అమ్మాయి గా నాకు చాలా గర్వంగా ఉంది. నిజమైన హీరో కెసిఆర్ గారికి నా ధన్యవాదాలు. ఇవాల్టితో నా కల నెరవేరింది. ఇవ్వాళ నన్ను ఒక హీరోయిన్ గా గుర్తిస్తున్నారు. సంవత్సర కాలంగా నేను పడ్డ ఆవేదనకి ఇప్పుడు మంచి ఫలితం దక్కింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం జీవో పాస్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఆనాడు నేను అర్థనగ్నంగా నిలబడినందుకు వచ్చిన ఫలితం ఇది. ఇందులో ముఖ్యమైన వాళ్లు సంధ్య, వాసుద, సజయ, తేజ్.. లవ్ యూ ఆల్. అందరికీ నా కృతజ్ఞతలు" అంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories