Sreerama Chandra: రామచంద్రా..!! తెర మీదకి శ్రీరెడ్డి - శ్రీరామ్ వాట్సప్ చాట్

Sandeep Reddy
Published on: 7 Nov 2021 3:54 PM IST
Sri Reddy And Singer Sreerama Chandra Personal Whatsapp Chat Viral in Social Media Again
X

శ్రీ రామ చంద్ర (ఫోటో: ది హన్స్ ఇండియా)

Singer Sreerama Chandra: సింగర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టంట్ శ్రీరామచంద్ర వాట్సప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగేళ్ల క్రితం నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ద్వారా "చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్" అంటూ సింగర్ శ్రీరామ్ తో చేసిన చాట్ ని బయటపెట్టి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ చాట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టంట్ లో శ్రీరామ్ ఉంటాడని అతడి ఆటని చూసిన బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం ఇది. అయితే శ్రీరామచంద్ర అంటే గిట్టని కొంతమంది వ్యక్తులు అతనికి వ్యతిరేకంగా ఈ చాట్ ని ఉపయోగిస్తూ శ్రీరామ్ అసలు క్యారెక్టర్ ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందుకు కౌంటర్ గా శ్రీరామచంద్ర అభిమానులు మాత్రం అసలు చాటింగ్ మొత్తం మొదటి నుండి చదివితే ఎవరిది తప్పో అర్ధమవుతుందని, శ్రీరెడ్డి రెచ్చగొట్టే విధంగా శ్రీరామ్ తో మాట్లాడం వల్లే ఆ చాట్ జరిగిందని శ్రీరామ్ అభిమానులు మాత్రం సమర్దించుకుంటున్నారు.

ఇక ఈ వాట్సప్ చాట్ లో శ్రీరామచంద్ర.. శ్రీరెడ్డి వ్యక్తిగత ఫోటోలు అడగడంతో పాటు ఎక్కడ ఉంటున్నావ్.. ముంబైకి వస్తావా అంటూ అడగడం చాట్ లో చూడొచ్చు. ఆ మధ్య హాట్ టాపిక్ గా మారిన ఈ చాట్ ఇప్పుడు ఎవరో బిగ్ బాస్ ఇంటి సభ్యుల అభిమానుల కారణంగా మరోసారి తెర మీదికి వచ్చిపడ్డాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో హమీదాతో సన్నిహితంగా ఉన్న శ్రీరామ్.. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత రెండు మూడు వారాల పాటు డీలా పడినట్టుగా కనిపించింది.

సింగర్ శ్రీరామ చంద్ర - శ్రీ రెడ్డి వాట్సాప్ చాట్


Sandeep Reddy

Sandeep Reddy

Next Story