"ఉస్తాద్" షూటింగ్ లో రామ్ తో శ్రీ లీల

* రామ్ తో షూటింగ్ మొదలుపెట్టిన బోయపాటి

Dhatripriya
Published on: 6 Jan 2023 9:10 AM IST
Sri Leela With Ram In The Shooting Of Ustad
X

"ఉస్తాద్" షూటింగ్ లో రామ్ తో శ్రీ లీల

Ram Pothineni: ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను త్వరలోనే రామ్ హీరోగా "ఉస్తాద్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. "ఇష్మార్ట్ శంకర్" సినిమాలోని తన మాస్ యాంగిల్ ను చూపించిన రామ్ బోయపాటి డైరెక్షన్లో కూడా ఒక ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ ని ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి మాస్ రోల్ లో బోయపాటి చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం బోయపాటి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ మరియు శ్రీ లీల తో పాటు మరికొందరు నటినటులు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మధ్యనే రామ్ హీరోగా నటించిన "ది వారియర్" సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమాతో రామ్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story