Balakrishna: బాలయ్య కూతురిగా ఆ యంగ్ హీరోయిన్ ?

Sreeleela Will Play Balakrishnas Daughter
x

Balakrishna: బాలయ్య కూతురిగా ఆ యంగ్ హీరోయిన్ ?

Highlights

Balakrishna: "పెళ్లిసందడి" సినిమా లో హీరో రోషన్ సరసన హీరోయిన్ గా కనిపించిన శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది.

Balakrishna: "పెళ్లిసందడి" సినిమా లో హీరో రోషన్ సరసన హీరోయిన్ గా కనిపించిన శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది. ఆ సినిమా మంచి హిట్ అవడంతో టాలీవుడ్ నుంచి బోలెడు మంచి ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ మధ్యనే బరువు కూడా తగిన శ్రీలీల తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా "ధమాకా" సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో నటించే అవకాశాన్ని చేజిక్కించుక్కుంది ఈ భామ. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరిన్ లు నటించిన ఈ సినిమా మే 27 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల ముఖ్య పాత్ర పోషించనున్నారట. అయితే బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాకుండా శ్రీలీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతున్నారు అని ఒక టాక్ నడుస్తోంది. ఇక బాలకృష్ణ ని అనిల్ రావిపూడి ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్న సంగతి తెలిసిందే. మరి తండ్రి కూతురు లాగా బాలకృష్ణ మరియు శ్రీలీల నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories