SSMB28: లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా మహేష్‌బాబుకు జోడీగా..

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 26 Nov 2022 9:30 PM IST
Sreeleela Will Be Playing Second Female Lead Role In SSMB28
X

SSMB28: లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఏకంగా మహేష్‌బాబుకు జోడీగా..

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూడవ సినిమా ఇది. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గురించి ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. "పెళ్లి సందడి" సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు మహేష్ బాబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీ లీల రెండవ హీరోయిన్ గా కనిపించబోతోంది.

ఈ సినిమా ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంతేకాకుండా ఒక స్టార్ హీరోయిన్ సినిమాలో మహేష్ బాబు సరసన ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు కూడా వేయబోతోందని సమాచారం. ఒక సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28 2023 థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story