Sreeleela - Dil Raju: దిల్ రాజు క్యాంపు లో చేరిన "పెళ్లి సందడి" బ్యూటీ

* దిల్ రాజు నిర్మిస్తున్న ఒక సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది.

admin1
Published on: 7 Nov 2021 2:33 PM IST
Sreeleela will Act in Producer Dil Raju New Movie
X

దిల్ రాజు క్యాంపు లో చేరిన "పెళ్లి సందడి" బ్యూటీ(ఫైల్ ఫోటో)

Sreeleela - Dil Raju: ఈ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా విడుదలైన "పెళ్లిసందడి" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీ లీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె ఇప్పుడు వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

కేవలం అందంతో మాత్రమే కాక నటన మరియు డాన్స్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ లీల మీద ఇప్పుడు దర్శకనిర్మాతలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. రెండవ సినిమాకి మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం దక్కించకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీ లీల ఇప్పుడు మరో సినిమాకు కూడా సైన్ చేసింది.

ఈసారి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఒక సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమాతోనే దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత కంట పడటం అంత సులువైన విషయం కాదు. కెరీర్ మొదట్లోనే దిల్రాజు నిర్మాణంలో సినిమా అంటే గొప్ప విషయం అని చెప్పుకోవాలి.

మరి దిల్ రాజు సినిమా ఈమె కరియర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఈ సినిమా నటీనటులు గురించి త్వరలోనే దర్శక నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు.

admin1

admin1

Next Story