Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నిర్మాతలు

Sree Leela: రాఘవేంద్ర రావు హీరోయిన్ కోసం క్యూ కట్టిన దర్శకనిర్మాతలు

admin1
Updated on: 27 Oct 2021 8:30 PM IST
Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నిర్మాతలు
X

పెళ్లి సందడి హీరోయిన్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నిర్మాతలు (ట్విట్టే ఇమేజ్)

Sree Leela: ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరోయిన్ లకు కుప్పలుతెప్పలుగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయిన హీరోయిన్ శ్రీ లీ. దర్శక దిగ్గజం అయిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన అందాల భామ శ్రీ లీల. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టింది. తన అందం మరియు అభినయంతో చాలా బాగా ఆకట్టుకున్న శ్రీ లీల కి ఇప్పుడు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఆమె యాక్టింగ్ మరియు డాన్స్ కి దర్శక నిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారట. ఇప్పటికే ఈమె మాస్ మహారాజా రవితేజ "ధమాకా" సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈమెకు ఇప్పుడు మరొక నాలుగైదు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నాయని అందులో త్వరలోనే వీటి గురించి అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెకి ఒక మెగా హీరోతో కూడా సినిమా చేసే అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు.

admin1

admin1

Next Story