Sreeleela: పవన్ సినిమాలో శ్రీలీల కన్‌ఫర్మ్.. షూటింగ్‌కు రెడీ అవుతోన్న..

Sree Leela: మహేష్ బాబు తర్వాత ఇప్పుడు మరొక స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న శ్రీ లీల..

Dhatripriya
Updated on: 1 April 2023 8:31 PM IST
Sreeleela As Heroine In Pawan Kalyan Ustaad Bhagat Singh
X

Sreeleela: పవన్ సినిమాలో శ్రీలీల కన్‌ఫర్మ్.. షూటింగ్‌కు రెడీ అవుతోన్న..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" తెలుగు రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగులో కూడా హరీష్ శంకర్, సుజిత్ దర్శకత్వంలో సినిమాలు లైన్ లో పెట్టారు. "గబ్బర్ సింగ్" తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం అందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం ఒక స్టార్ బ్యూటీని ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న యువ హీరోయిన్ శ్రీ లీల త్వరలోనే మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది ఈ భామ.

ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కబోతోంది. ఇక ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్లో శ్రీ లీల కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో ఎవరు నటించనున్నారు అని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story