Sreekaram OTT Release Date: ఓటీటీలో 'శ్రీకారం' ఎప్పుడో తెలుసా!

Sreekaram OTT Release Date: శ్రీకారం సినిమా ఓటీటీలో 16వ తేదీ విడుదల కానుంది.

Kranthi
Updated on: 15 April 2021 1:21 PM IST
Do you know when Srikaram will be released on OTT?
X

Sreekaram:(File Image)

Sreekaram OTT Release Date: 'వచ్చానంటివో, పోతానంటివో.. వగలు పలుకుతావే' అనే సాంగ్ గత ఏడాది రిలీజై ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాట యుత్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'శ్రీకారం'. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. సన్‌నెక్స్ట్‌ లో ఏప్రిల్‌ 16 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూసేయండి.

ఓటీటీలో 'బంగారు బుల్లోడు'

అల్లరి నరేష్‌ హీరోగా గిరి పల్లిక దర్శకత్వం రూపొందిన తాజా చిత్రం 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్‌నెక్స్ట్‌ స్టీమింగ్ అవుతోంది.

ఓటీటీలో 'తెల్లవారితే గురువారం'

కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చిత్రం నిర్మించిన 'తెల్లవారితే గురువారం' సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

Kranthi

Kranthi

Next Story