Sree Leela: బాహుబలి తో హీరోయిన్ గా నటించనున్న శ్రీలీల

Sree Leela: బాహుబలి తో హీరోయిన్ గా నటించనున్న శ్రీలీల

admin1
Updated on: 16 Feb 2022 12:00 PM IST
Sree Leela will Act as the Heroine with Prabhas | Tollywood News
X

Sree Leela: బాహుబలి తో హీరోయిన్ గా నటించనున్న శ్రీలీల

Sree Leela: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు. గత కొంత కాలంగా ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు అని, ప్రభాస్ ఈ సినిమా లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందులో ఒక హీరోయిన్ ఈమె అంటూ టాలీవుడ్ వర్గాలు బోగట్టా.

ఆమె మరెవరో కాదు పెళ్లి సందడి ఫేమ్ బ్యూటీ శ్రీలీల. హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మా లో ప్రభాస్ సరసన శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సందడితో సినిమా హీరోయిన్ గా మారిన శ్రీలీల తన కెరీర్ మొదట్లోనే ప్రభాస్ వంటి హీరో తో చేసే అవకాశం రావటం తనకి ఒక టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం నటించిన "రాధే శ్యామ్" సినిమా మార్చి 11న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story