Sree Leela: రెండో సినిమాకి ఎన్టీఆర్ తో జతకట్టనున్న పెళ్లిసందడి బ్యూటీ

Sree Leela: స్టార్ హీరోతో నటించే చాన్స్ కోట్టెసిన శ్రీ లీల

admin1
Updated on: 28 Oct 2021 7:30 PM IST
Sree Leela Got the Chance to Act With Jr NTR
X

జూనియర్ ఎన్టీఆర్ తో కలసి నటించే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల (ఫైల్ ఇమేజ్)

Sree Leela: మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఇప్పుడు వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీ లీల. దర్శక దిగ్గజం అయిన రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ఈ మధ్యనే విడుదలైన "పెళ్లిసందడి" సినిమా లో హీరోయిన్ గా నటించింది ఈ భామ. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన హీరోయిన్ గా కనిపించిన ఈమె మొదటి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు శ్రీ లీల ముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. అదే స్పీడులో శ్రీ లీల కూడా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తోంది.

ఇప్పటికే శ్రీ లీల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న "ధమాకా" సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు శ్రీ లీల కు ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బిజీగా ఉన్న ఎన్టిఆర్ ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "జనతాగ్యారేజ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే శ్రీ లీలకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం కూడా ఉంది.

admin1

admin1

Next Story