Sree Leela: దిల్ రాజు క్యాంప్ లో చేరిన "పెళ్లి సందడి" బ్యూటీ

Sree Leela: దిల్ రాజు నిర్మాణంలో "పెళ్లి సందడి" హీరోయిన్

admin1
Updated on: 27 Nov 2021 4:35 PM IST
Sree Leela Going to be Do a Film in Dill Raju Banner
X
దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయనున్న శ్రీలీల (ఫైల్ ఇమేజ్)

Sree Leela: ఈమధ్యనే విడుదలైన "పెళ్లి సందడి" సినిమాతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది కొత్త హీరోయిన్ శ్రీలీల. ఈ సినిమా విడుదల కాక ముందే మాస్ మహరాజా రవితేజ సరసన ఓ సినిమా కు సైన్ చేసింది ఈ భామ. ఇప్పుడు మరో సినిమా కూడా ఒప్పుకుంది శ్రీ లీల. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కనున్న రెండవ సినిమా కి శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాను దిల్ రాజు స్వయంగా నిర్మిస్తారా లేక ఆయన సన్నిహితులు చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. తొలిసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అడియో ఇచ్చారు కానీ పాటలు పెద్దగా క్లిక్ అవ్వలేదు.

అందుకే ఈసారి మిక్కీ జే మేయర్ ను సినిమాకోసం ఎంచుకున్నారు. దిల్ రాజు- మిక్కీ కాంబోలో ఇప్పటికే చాలా మంచి హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ఇక "పెళ్లి సందడి"కి పాటలు రాసిన చంద్రబోస్ ను ఈ సినిమాకి కూడా రైటర్ గా తీసుకున్నారు. మరి డైరక్టర్ ఎవరు అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది. ఇది పక్కన పెడితే ఆశిష్ మూడవ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. "జై పాతాళ భైరవి" అనే టైటిల్ ను ఖరారు చేసారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడిని ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

admin1

admin1

Next Story