Kiran Abbavaram: భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న యువ హీరో

admin1
Updated on: 11 Aug 2021 4:14 PM IST
SR Kalyanamandapam Kiran Abbavaram Increased Remuneration for his New Movies
X

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: ఈ మధ్యకాలంలో కేవలం ఒకే ఒక్క సినిమా నటీనటులను స్టార్లను చేస్తోంది. తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు అందరి దృష్టిలోనూ పడ్డాడు. మొదటి సినిమా "రాజావారు రాణిగారు" తో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యువ హీరో కి ఆఫర్ లు బాగానే అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్లు సమాచారం. ఒక్క సినిమా కోసం కిరణ్ ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

చేసింది రెండు సినిమాలే అయినా రెండు కోట్లు అడుగుతుండడంతో ఆఖరికి నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారట. నిజానికి "ఎస్ ఆర్ కళ్యాణమండపం" సినిమా మొత్తానికి బడ్జెట్ మూడు కోట్లు ఖర్చయింది. అలాంటిది తర్వాత సినిమా నుంచి కేవలం కిరణ్ రెమ్యూనరేషన్ కోసం రెండు కోట్లు ఖర్చు అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత పెరుగుతుంది? మరి ఆ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు చివరికి ఎంత మిగులుతుంది? అని ఆలోచనలో పడ్డారు దర్శక నిర్మాతలు. మరికొందరు మాత్రం ప్రస్తుతం కిరణ్ కి ఉన్న క్రేజ్ ను చూసి రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు అంటూ అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు.

admin1

admin1

Next Story