కలెక్షన్లతో రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం

SR Kalyanamandapam Created a Record With Good Box Office Collections
x

ఎస్ ఆర్ కళ్యాణమండపం పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

SR Kalyanamandapam: "రాజావారు రాణి గారు" అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల...

SR Kalyanamandapam: "రాజావారు రాణి గారు" అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఆగస్టు 6 2021 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.66 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా 'ఎస్ ఆర్ కళ్యాణమండపం' రికార్డు సృష్టించింది.

ఇక ఏరియా వైజ్ గా ఎస్ ఆర్ కళ్యాణమండపం కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నైజాం: 2.94 కోట్లు

సీడెడ్: 1.15 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు

ఈస్ట్ గోదావరి: 0.51 కోట్లు

వెస్ట్ గోదావరి: 0.35 కోట్లు

గుంటూరు: 0.69 కోట్లు

కృష్ణా: 0.42 కోట్లు

నెల్లూరు: 0.25 కోట్లు

ఓవర్సీస్: 0.70 కోట్లు

వరల్డ్ వైడ్: 8.31 కోట్లు

మరోవైపు ఈ సినిమా ఆడియో, డిజిటల్, సాటిలైట్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ తో ఈ చిత్రం ఐదు కోట్లను గడిచింది. ఆగస్టు 28 నుంచి ఈ చిత్రం ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories