SR Kalyana Mandapam Collections: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న "ఎస్ అర్ కళ్యాణమండపం"

SR Kalyana Mandapam Collections: "రాజావారు రాణి గారు" అనే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

admin1
Published on: 9 Aug 2021 7:41 PM IST
SR Kalyana Mandapam 3 Days Total World Wide Collections
X

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న "ఎస్ అర్ కళ్యాణమండపం"

SR Kalyana Mandapam Collections:"రాజావారు రాణి గారు" అనే సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 6 2021 న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు యావరేజ్ అని టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలయ్యాయి అని చెప్పచ్చు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా చాలా చోట్ల సేఫ్ జోన్ కు రావడం విశేషం. అంతేకాక బ్రేక్ ఈవెన్ కూడా దాటిపోయింది. సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 1.70 కోట్లు

సీడెడ్: 0.83 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.45 కోట్లు

ఈస్ట్: 0.25 కోట్లు

వెస్ట్: 0.19 కోట్లు

గుంటూరు: 0.36 కోట్లు

కృష్ణా: 0.18 కోట్లు

నెల్లూరు: 0.10 కోట్లు

ఏపీ + తెలంగాణ: 4.06 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.31 కోట్లు

వరల్డ్ వైడ్: 4.38 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ 4.55 కోట్లకు అమ్మారు. కానీ మూడు రోజుల్లోనే నైజాం సహా చాలా ఏరియాల్లో "ఎస్ అర్ కళ్యాణమండపం" సినిమా సేఫ్ జోన్ కు వచ్చేసి అందరినీ అబ్బురపరిచింది. ఇదే జోరు కొనసాగితే సినిమా చాలా పెద్ద విజయం సాధించడం ఖాయం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సెకండ్ వేవ్ తర్వాత హిట్ అయిన మొదటి సినిమాగా "ఎస్ అర్ కళ్యాణమండపం" చరిత్ర సృష్టించింది.

admin1

admin1

Next Story