Pushpa Teaser: అల్లు అర్జున్ బర్త్ డే న ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ ప్రైజ్

Pushpa Teaser: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఆయన ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు.

Venkata Chari
Published on: 1 March 2021 4:37 PM IST
Special Surprise for Allu Arjun fans on His Birthday April 8th
X

అల్లు అర్జున్ (ఫోటో హన్స్ ఇండియా)

Pushpa Teaser: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఆయన ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం 'పుష్ప' టీజర్ ను బన్ని బర్త్ డే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టీజర్‌ను అల్లు అర్జున్ బర్త్ డే రోజున అంటే ఏప్రిల్ 8 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారంట.

కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ క్లీనర్ పాత్రలో అలరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగినట్టుగానే తన బాడీని మార్చుకున్నాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ మేకప్ కోసమే రోజుకు మూడున్నర గంటలు పడుతున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తమిళనాడులో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేస్తున్నారు. 50 శాతం షూటింగ్ ఈ షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన్న నటిస్తోంది. పుష్ప చిత్రాన్ని ఆగస్టు 13 న గ్రాండ్ గా రిలీజ్ కోసం చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Venkata Chari

Venkata Chari

Next Story