Ghani: బాక్సింగ్ ఎపిసోడ్ల కోసం స్సెషల్ సెట్స్

Special sets for Varun Tejs boxing episodes
x

 వరుణ్ తేజ్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'ఘని'తో బిజీగా ఉన్నాడు.

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'ఘని'తో బిజీగా ఉన్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను ఏప్రిల్ చివరి కల్లా ముగించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇందుకోసం మూవీ యూనిట్ ప్రత్యేకంగా సెట్స్ వేసినట్లు తెలిసింది. ఈ ప్రత్యేక సెట్లో కొన్ని యాక్షన్ ప్యాక్డ్ బాక్సింగ్ ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వైజాగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ఇటీవలే పూర్తి చేశారు.

కిరణ్ కొర్రపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, రమ్య కృష్ణ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2021 జులై 30 న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఎఫ్ 3' లో నటించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories