Adipurush: 'ఆదిపురుష్‌' సెట్ లో అలాంటి రూల్స్..

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తన తదుపరి చిత్రం ఆదిపురుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Venkata Chari
Published on: 1 April 2021 9:33 PM IST
Special sets erected for Adipurush
X
ప్రభాస్ (ఫొటో హన్స్ ఇండియా)

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తన తదుపరి చిత్రం ఆదిపురుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో వేగం పెంచారు మేకర్స్. రెబల్ స్టార్ మరో నూతన ప్రాజెక్ట్‌లో చేరేలోపు ఆయన సన్నివేశాలను పూర్తి చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. తాజాగా విషయం ఏంటంటే, మేకర్స్ సెట్ లో కొత్తగా కొన్ని రూల్స్ పెట్టారంట. సెట్స్‌లో పరిమిత సిబ్బందితో షూటింగ్ చేస్తుందంట. సెట్ లో 25 మందికి మించకూడదని కండీషన్ పెట్టుకున్నట్లు టాక్.

అలాగే, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసేందుకు ఫిల్మ్ యూనిట్ ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేసింది. సినిమా ఫుటేజ్, పిక్చర్స్ బయటకు రాకుండా చూసేందుకు అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ప్రభాస్, కృతి సనన్ తో పాటు సన్నీ సింగ్ ఉండే సీన్స్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నారు.

ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ఫిల్మ్ యూనిట్ ఇంకా వెల్లడించలేదు. సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్రంలో నటిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story