Kalyan Ram New Movie: 'అమిగోస్' గా రానున్న కళ్యాణ్ రామ్

Spanish Word Amigos as a Title for Kalyan Rams New Movie
x

కళ్యాణ్ రామ్

Highlights

Kalyan Ram New Movie: నందమూరి కళ్యాణ్ రామ్ తన రాబోయే చిత్రం కోసం దర్శకుడు రాజేంద్రతో చేతులు కలిపాడు.

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ తన రాబోయే చిత్రం కోసం దర్శకుడు రాజేంద్రతో చేతులు కలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా పూజా కార్యక్రమం చేసి మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'అమిగోస్' ను ఈ చిత్రానికి టైటిల్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 'అమిగోస్' అనేది స్పానిష్ పదం. ఇది స్నేహితుడిని ఉద్దేశించడానికి లేదా సూచించేందుకు వాడుతారు.

ఈ చిత్రం మొదటి షూటింగ్ షెడ్యూల్ మార్చి రెండవ వారంలో ప్రారంభమైంది. ఈ సినిమా గురించి వివరాలు ఇంకా విడుదల కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories