Trisha Krishnan: త్రిషను వరించిన యూఏఈ గోల్డెన్ వీసా

*గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా రికార్డ్ *సోషల్ మీడియాలో త్రిషకు శుభాకాంక్షల వెల్లువ

Sandeep Reddy
Updated on: 4 Nov 2021 7:30 PM IST
South Actress Trisha Krishnan Got UAE Golden Visa
X

త్రిషను వరించిన యూఏఈ గోల్డెన్ వీసా (ట్విట్టర్ ఫోటో)

Trisha Krishnan: దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ త్రిష అరుదైన ఘనతను సొంతంగా చేసుకున్నారు. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా త్రిషను వరించింది. అంతేకాకుండా.. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా త్రిష యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసింది. దీంతో త్రిష సోషల్ మీడియాలో శభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు యూఏఈ వీసాను అందుకున్న వారిలో ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర ఉన్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి సినీ నటిగా త్రిష నిలిచింది. ఈ వీసా ఉన్నవారు సుదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండొచ్చు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story