సోనూ సూద్‌కు అరుదైన గౌరవం!

సోనూ సూద్‌కు అరుదైన గౌరవం!
x

Sonu Sood 

Highlights

SDG Special Humanitarian Action Award : సాయానికి మారు పేరుగా నిలిచిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం లభించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి గ్రామాలకు పంపించిన ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

SDG Special Humanitarian Action Award : సాయానికి మారు పేరుగా నిలిచిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం లభించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి గ్రామాలకు పంపించిన ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి నుంచి 'SDG స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్' అవార్డును సోనూ సూద్‌ అందుకున్నారు. ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన వర్చువల్ వేడుకలో ఈ అవార్డును సోనూ సూద్‌కు అందజేశారు.

తన సినిమాల్లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. చిన్న పిల్లలకు ఉచిత విద్య మరియు వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు.. ఇలా సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories