Sonu Sood Helps to Actor Anupam Shyam: ఆస్పత్రిలో నటుడు.. సోనూ సూద్‌.. మరో సాయం

Sonu Sood Helps to Actor Anupam Shyam: కష్టాల్లో ఉన్న మనుషుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చే సోనూసూద్.. ఇటీవల పేదలకు పెద్దఎత్తున సాయం అందించి వార్తల్లో నిలిచారు

Raj
By Raj
Published on: 29 July 2020 7:35 PM IST
Sonu Sood Helps to Actor Anupam Shyam: ఆస్పత్రిలో నటుడు.. సోనూ సూద్‌.. మరో సాయం
X
Sonu Sood help

Sonu Sood Helps to Actor Anupam Shyam: కష్టాల్లో ఉన్న మనుషుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చే సోనూసూద్.. ఇటీవల పేదలకు పెద్దఎత్తున సాయం అందించి వార్తల్లో నిలిచారు. ఇటీవల చిత్తూరు రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిన సోనూ.. తాజాగా మరో సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు. టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు సోనూ సూద్‌. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనుపమ్‌ శ్యామ్‌కు సహాయం చేస్తానని ట్విటర్‌ వేదికగా మాటిచ్చారు సోనూ‌. త్వరలో అనుపమ్‌ కుటుంబాన్ని కలిసి తగిన డబ్బు అందజేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనుపమ్‌ ఇటీవలే ఆస్పత్రిలో చేరారు. దాంతో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. అయినా అతని ఆరోగ్యం ఇంకా నయం కాలేదు.

ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తదుపరి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అనుపమ్‌ సోదరుడు అనురాగ్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ట్విటర్‌ లో ఒకతను అనుపమ్‌ శ్యామ్ యొక్క ఆరోగ్యస్థితిని ,‌ వైద్యానికి కావాల్సిన డబ్బు వివరాలను షేర్ చేసాడు. ఈ క్రమంలో అనుపమ్ కు ఆర్థిక సాయం చేయాలంటూ సోనూ సూద్‌ను ట్విట్టర్ లో ట్యాగ్‌ చేశాడు. దీనిపై స్పందించి.. అనుపమ్‌ శ్యామ్‌ను తాను ఆదుకుంటానని సోనూ సూద్‌ హామీ ఇచ్చారు. వైద్యానికి అవసరమయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు. దీంతో సోను సూద్ ‌ను మరోసారి సోషల్ మీడియా వేదికగా నెటిజెన్ల అభినందిస్తున్నారు.

Raj

Raj

Next Story