టాప్ 4 లో సోనూసూద్ : స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసాడు

టాప్ 4 లో సోనూసూద్ : స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసాడు
x
Highlights

ఇప్పుడు సోనూసూద్ మరో ఘనత సాధించాడు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు. టాప్ 3లలో మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగా, రెండో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు

SonuSood Rank No.4 in Twitter Bollywood Superstars : సోనూసూద్ .. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. సహాయానికి నిలువెత్తు నిదర్శనం అయన .. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకపోయిన వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. అయన సేవలకి గాను ప్రధాని మోడీతో పాటుగా చాలా మంది సోనూసూద్ ని ప్రశంసించారు. అటు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సోనూసూద్ మరో ఘనత సాధించాడు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లను కలిగివున్న భారతీయుల్లో టాప్-4కు దూసుకెళ్లాడు. టాప్ 3లలో మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండగా, రెండో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నారు. వీరి తరవాతి స్థానంలో సోనూసూద్ నిలిచాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అనలిటిక్స్ వెల్లడించింది. సినీ స్టార్స్ ని, రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టేసి సోనూసూద్ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇటీవల సోనూసూద్ ని పంజాబ్ రాష్ట్ర ఐకాన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories