Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్నారా? టెన్షన్ వద్దు.. నేనున్నా

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్నారా? టెన్షన్ వద్దు.. నేనున్నా
Sonu Sood: ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని సోనూసూద్ (Sonu Sood) మరోసారి నిరూపించుకున్నారు.
Sonu Sood: ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని సోనూసూద్ (Sonu Sood) మరోసారి నిరూపించుకున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు రద్దై, వేలాది మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఇబ్బంది పడుతున్న వారికి సోనూసూద్ భరోసా కల్పించారు.
దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తాను ఉచితంగా వసతి కల్పించనున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. ఈ సాయం పొందేందుకు ఎటువంటి కఠినమైన షరతులు లేవని, ఏ దేశానికి చెందిన వారైనా సరే తనను సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మాత్రమే ముఖ్యం. దుబాయ్‌లో విమానాలు లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నా టీమ్ వెంటనే మిమ్మల్ని సంప్రదించి అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది" అని సోనూసూద్ పేర్కొన్నారు.
గతంలో కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను బస్సులు, విమానాల ద్వారా స్వస్థలాలకు చేర్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సోనూసూద్, ఇప్పుడు విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం స్పందించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు ప్రయాణికులకు బస, ఆహార సౌకర్యాలు కల్పించడం గమనార్హం. మరోసారి తనలోని మానవత్వాన్ని చాటుకున్న సోనూసూద్‌ను "రియల్ హీరో" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



