మహేష్‌ బాబు సినిమాకు లీక్‌ల ముప్పు.. సర్కారు వారి పాట మూవీ ప్రతి అప్డేట్‌ లీక్‌..

Sarkaaru Vaari Paata: ప్రిన్స్ మహేష్‌ బాబు సినిమాకు లీక్‌ల ముప్పు తప్పడం లేదు.

Arun Chilukuri
Updated on: 20 March 2022 4:30 PM IST
Song From Sarkaaru Vaari Paata Leaked
X

మహేష్‌ బాబు సినిమాకు లీక్‌ల ముప్పు..

Sarkaaru Vaari Paata: ప్రిన్స్ మహేష్‌ బాబు సినిమాకు లీక్‌ల ముప్పు తప్పడం లేదు. సర్కారు వారి పాట మూవీ ప్రతి అప్డేట్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ కావడం.. చిత్ర బృందాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట టైటిల్‌ దగ్గర నుంచి టీజర్‌, పాటలు, డైలాగులు ఇవన్నీ లీక్‌ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా సెకండ్‌ సింగిల్‌ పెన్నీ సాంగ్ లీకైంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4గంటల 5నిమిషాలకు ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఉదయం నుంచే పెన్నీ ఫుల్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మైత్రీ మూవీస్‌పై మహేష్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story