Tollywood: మెగాస్టార్‌తో జోడీ కట్టనున్న సోనాక్షి!

Sonakshi Sinha to Share Screen With Chiru for Bobby Film
x

Megastar Chiranjeevi, Sonakshi Sinha

Highlights

Tollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా మెగాస్టార్ తో జోడీ కట్టనున్నట్లు టాలీవుడ్ టాక్

Tollywood: చిరంజీవి సరసన సందడి చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ కూడా బాగానే చెల్లించేందుకు ఒప్పందం జరిగిందట. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి 'ఆచార్య' పనుల్లో బిజీగా ఉన్న చిరు.. డైరెక్టర్‌ బాబీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉంది. మే 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. చిరంజీవి ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్, డైరెక్టర్‌ మోహన్‌రాజాతో కలిసి 'లూసిఫర్‌' రీమేక్‌లో నటించనున్నారు. ఆ తర్వాత బాబీ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories