బాల‌కృష్ణ‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. అలా సెట్ చేసిన అనిల్ రావిపూడి..

Sonakshi Sinha for Balakrishna’s NBK108 Film
x

బాల‌కృష్ణ‌ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. అలా సెట్ చేసిన అనిల్ రావిపూడి..

Highlights

బాలకృష్ణ భార్య పాత్రలో రజనీకాంత్ హీరోయిన్

NBK108: "అఖండ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశారు. రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో కూడా ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా తీయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. "పెళ్లి సందడి" బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా ప్రియమణి ని అనుకున్నారు కానీ మరి అవుట్ డేటెడ్ గా అనిపించడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు మరొక హీరోయిన్ ని ఎంపిక చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అయితే బాలకృష్ణ పక్కన చాలా బాగా సెట్ అవుతుందని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి "లింగా" సినిమాలో రజనీకాంత్ సరసన సోనాక్షి ని హీరోయిన్ గా ఎంపిక చేసినప్పుడు ఆరుపదుల వయసున్న రజినీకాంత్ పక్కన సోనాక్షి ఏం బాగుంటుంది అని కొందరు అనుమానించారు కానీ సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకి సోనాక్షి చాలా బాగా సెట్ అయిందని అన్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో బాలయ్య భార్య పాత్రలో సోనాక్షి అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. మరి బాలయ్య సరసన నటించడానికి సోనాక్షి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories