Chourasia Attack Case: నటిపై అత్యాచారయత్నం చేసిన లైట్ బాయ్

* సినీ నటి షాలు చౌరాసియా కేసులో కొత్త మలుపు

admin1
Published on: 22 Nov 2021 2:58 PM IST
Some Shocking Facts Came Out in the Trial of Chourasia Attack Case
X

షాలు చౌరాసియా (ఫైల్ ఫోటో)

Chourasiya Attack Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కెబిఆర్ పార్కులో సినీనటి చౌరాసియా మీద జరిగిన దాడి వెనుక మిస్టరీ హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వివరాల్లోకి వెళితే నటి చౌరాసియా ఆదివారం రాత్రి ఎనిమిది నాలుగు నలభై నిమిషాలకి కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడికి దిగారు.

ముందుగా ఆమెని పది వేలు డిమాండ్ చేశారని కానీ ఆమె తన వద్ద క్యాష్ లేదని పేటీఎం చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు తన ఫోన్ ని కూడా ఎత్తుకెళ్లారు అని ఆమె కంప్లైంట్ నమోదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఊహ చిత్రం ఆధారంగా ఇందిరా నగర్ మరియు కృష్ణానగర్ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలలో వెతికి నిందితుడిని పట్టుకున్నారు.

నిందితుడు లైట్ బాయ్ గా పనిచేస్తున్న కె బాబు అని తెల్సుకున్న పోలీసులు తక్షణం అతన్ని అరెస్టు చేసి ప్రస్తుతం రిమాండ్ కి తరలించారు. అయితే విచారంలో కొన్ని షాకింగ్ నిజాలు కూడా బయట పడ్డాయి. ఈ ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందు నుంచే నిందితుడు బాబు పక్క ప్లాన్ వేసుకున్నాడని ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారయత్నానికి కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story