రివ్యూ: సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌

రివ్యూ: సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌
x
Highlights

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది కొత్తేమి కాదు. రాజబాబు నుండి రీసెంట్‌గా సునీల్ వరకు అందరు కమెడియన్స్ హీరోగా నటించినవారే..

కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది కొత్తేమి కాదు. రాజబాబు నుండి రీసెంట్‌గా సునీల్ వరకు అందరు కమెడియన్స్ హీరోగా నటించినవారే.. ఇక జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా మారి సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ అంటూ ఓ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ మన సమీక్షలో చూద్దాం.

కథ:

ఇక కథ విషయానికి వస్తే చందు(సుధీర్) అనే కుర్రాడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తూ తన కొలీగ్‌ అయిన ధన్య బాలకృష్ణ ని చూసి ప్రేమలో పడతాడు. ఇరువురి కుటుంబాల సమక్షంలో ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా అవుతుంది. కానీ సుధీర్, ధన్య వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడంతో జాతకాలు వారిద్దరి జాతకాలను ఓ స్వామికి చూపిస్తారు. అందులో భాగంగా చందుకి ఒక దోషం ఉంది అని చెబుతాడు.దీనిని చందు నమ్మకపోవడంతో ఒక పుస్తకం ఇచ్చి 30 రోజులు కూడా ఆ పుస్తకంలో ఉన్నట్టే అతనికి జరుగుతుంది అని చెబుతాడు. అలా 29 రోజులు ఆ పుస్తకంలో ఉన్నట్టే జరుగుతుంది. కానీ 30 వ రోజు మాత్రం చందు చనిపోతాడు అని రాసి ఉంటుంది. అప్పుడు చందు, ధన్య ఏం చేశారు?, ఆ స్వామీజీ వాళ్ళను కాపాడాడా? అన్నది తెర పైన చూడాలి.

ఎలా ఉందంటే ?

సినిమా కూడా తన పేరుతో కూడుకున్న టైటిల్ నే పెట్టుకున్నాడు సుధీర్. ఇదే సినిమాకి ప్లస్ గా చెప్పుకోవచ్చు. అయితే సినిమాలో సుధీర్ హీరో కాబట్టి కామెడీకి కొదవలేదని అనుకున్నా ప్రేక్షకుడికి కనీసం జబర్దస్త్ లెవెల్‌లో కూడా కామెడీ లేకపోవడంతో నిరాశ తప్పదు, పేలి పేలని కామెడితో సినిమా మొదటి భాగాన్ని నడిపించాడు. ఇక రెండవ భాగంలో హీరోకి ప్రాణగండం ఉందని ఆ 30 రోజుల్లో ఏమో జరగబోతుంది అన్న ఆసక్తిని క్రియేట్ చేసిన దర్శకుడు దానిని రక్తికట్టించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి. కొన్ని చోట్ల హీరోయిజాన్ని బాగానే చూపించాడు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో కథని రీవీల్ చేసి ఒకే అనిపించిన దర్శకుడు అదే క్లైమాక్స్ విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేశాడు.

నటీనటులు:

ఇక నటీనటుల విషయానికి వచ్చేసరికి సినిమా మొత్తానికీ సుధీర్‌ హైలెట్ గా చెప్పుకోవాలి. కామెడీ, ఫైట్స్, డాన్స్ ఇలా అన్ని సన్నివేశాల్లో ఒకే అనిపించాడు సుధీర్. ఇక ధన్య తన నటనతో మెప్పించింది. గ్లామరస్ కూడా ఆకట్టుకుంది. ఎమోషన్ సన్నివేశాల్లో బాగా నటించింది. ఇక మిగతా నటినటులు తమ పాత్రల మేరకు బాగానే ఒదిదిగిపోయారు.

సాంకేతికవర్గం

ఇక సాంకేతికవర్గం విషయానికి వచ్చేసరికి సినిమాకి నిర్మాణ విలువలు ప్లస్ అయ్యాయి. సి.రామ్ ప్రసాద్ అందించి సిమిమాటోగ్రఫీ బాగుంది. బాగా క్వాలిటీగా సినిమాని చూపించాడు.. భీమ్స్ అందించిన రెండు పాటలు బావున్నాయి.

చివరగా ఓ మాట: తనకి వచ్చిన కామెడీతో సినిమాని చేసి సేఫ్ గా గేమ్ అడాల్సింది పోయి సుధీర్ ఓ ప్రయోగం చేశాడనే చెప్పాలి.

గమనిక: ఈ రివ్యూ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే. అతని అభిప్రాయాలను పొందుపరిచిన విశ్లేషణ ఇది. దీనిని కేవలం అతని అభిప్రాయంగానే పరిగణించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories