Sobhita Dhulipala: హాలీవుడ్‌లోనూ ఈ తెలుగమ్మాయి ఆకట్టుకుంటుందా..!

Sobhita Dhulipala to Mark her Hollywood Debut
x

శోభితా ధూళిపాళ (ఫొటో: ఫైల్ ఇమేజ్)

Highlights

Sobhita Dhulipala: అడివి శేషు నటించిన గూఢాచారి మూవీ సూపర్‌హిట్‌ టాక్ తో అలరించిన సంగతి తెలిసిందే.

Sobhita Dhulipala: అడివి శేషు నటించిన గూఢాచారి మూవీ సూపర్‌హిట్‌ టాక్ తో అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ కూడా అప్పట్లో టాక్ ఆఫ్ దిటౌన్ గా నిలిచింది. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ నటి. ప్రస్తుతం శోభిత హాలీవుడ్ లో అడుగుపెట్టింది.

రివేంజ్ డ్రామాగా సాగే హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్' లో శోభిత నటించారు. ఈ ప్రాజెక్టుకు నటుడు దేవ్ పటేల్ నిర్మాతగా వ్యవరిచాడు. ఆయనే ఈ సినిమాలో హీరోగా నటించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డిజిటల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను 30 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాబట్టి తెలుగమ్మాయి శోభిత కూడా ఈ సినిమా నుంచి ఎక్కువ రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2018 లో ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్. కొద్దిరోజుల కిందటే షూటింగ్‌ను పూర్తిచేశారు.

కాగా, 'మజోద్' సినిమాతో అడివి శేషుతో మరలా రోమాన్స్ చేసేందుకు సిద్ధమైంది శోభిత ధూళిపాళ. ఈ చిత్రం 2021 జులై 2 న థియేటర్లకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories